సీనియర్ సివిల్ జడ్జి మారం అర్పిత రెడ్డి.
ఘనంగా అంతర్జాతీయ మహిళ దినోత్సవం
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 07 : మహిళా హక్కుల కొరకై న్యాయస్థానం పని చేస్తుందని, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని సీనియర్ సివిల్ జడ్జి మారం ఆర్పిత రెడ్డి పేర్కొన్నారు.గురువారం పట్టణంలోని న్యాయస్థాన ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ అసదుల్లా షరీఫ్, న్యాయవాదులతో కలిసి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.శాలువాతో ఘనంగా మహిళా ఉద్యోగులకు సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…స్త్రీ లేకపోతే జననం లేదని,స్త్రీ లేకపోతే గమనం లేదని,స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదని,స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా లక్షెట్టిపేట మండల పరిషత్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంపీడీవో సరోజ ఘనంగా నిర్వహించారు.మహిళా పంచాయతీ కార్యదర్శులకు, ఈ జి ఎస్,కార్యాలయ మహిళా సిబ్బందికి శాలువాలతో ఘనంగా సన్మానించి స్వీట్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా అంబేడ్కర్ వారసుల కాలనీ రంగపేట అధ్వర్యంలో మహిళ ఉపాధ్యాయులను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ దేవేందర్ రావు,ఎంపీఓ విజయ్ ప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్,జి పద్మ,గాండ్ల సత్యనారాయణ,నేరెళ్ల రాజేశ్వర్,అక్కల శ్రీధర్, ప్రదీప్,అంబేద్కర్ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చిప్పకూర్తి నారాయణ తదితరులు పాల్గొన్నారు.