వరంగల్ లో పదో తరగతి పరీక్ష పత్రం లీకేజ్ పై వివరాలు వెల్లడించిన సిపి రంగనాథ్..

 

వరంగల్‌ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 04: తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీక్‌ వ్యవహారం కలకలం రేపుతున్న వేళ తాజాగా మొదలైన పదో తరగతి పరీక్షల్లోనూ పేపర్లు బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా పదవ తరగతి హిందీ క్వశ్చన్‌ పేపర్‌ సైతం వాట్సాప్‌ గ్రూప్‌లో చక్కర్లు కొట్టడం తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించింది. ఈ తరుణంలో మంగళవారం నాటి హిందీ క్వశ్చన్‌ పేపర్‌ పరీక్ష సమయం‍లోనే బయటకు వచ్చిన విషయాన్ని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ ధృవీకరించారు.
పేపర్‌ బయటకు వచ్చిన అంశంపై సైబర్‌ క్రైమ్‌ దర్యాప్తు కొనసాగుతోందని, సాయంత్రంకల్లా అసలు విషయం తేలుతుందని ఆయన అన్నారు . పేపర్‌ బయటకు వచ్చిన విషయం మీడియా ద్వారానే పోలీస్ శాఖకు తెలిసిందనీ, ఎగ్జామ్‌ ప్రారంభమైన గంట తర్వాత పేపర్‌ వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా బయటకు వచ్చిందనీ, అంటే దాదాపు సగం పరీక్ష అయ్యాక వచ్చిందన్నమాట అన్నారు. కాబట్టి దీనిని లీక్‌ అనడం సరికాదనీ , పరీక్ష మధ్యలో ఉండగానే పేపర్‌ బయటకు వచ్చిందనీ భావిస్తున్నాట్లు పేర్కొన్నారు. ఒక మీడియా ఛానెల్‌ మాజీ రిపోర్టర్‌ ద్వారా పేపర్‌ సోషల్‌ మీడియాలోకి వచ్చిందని ప్రాథమికంగా తేలిందనీ, అయితే అతనికి ఎక్కడి నుంచి వచ్చిందనేది తేలాల్సి ఉందనీ అన్నారు. బహుశా ఇన్విజిలేటర్ ఫోన్ లోపలికి తీసుకెళ్లడం వల్లే పేపర్ బయటికి వచ్చిందని భావిస్తున్నాట్లు తెలిపారు . ఈ అంశంపై విచారణ జరుగుతోందనీ, సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నాట్లు సాయంత్రం కల్లా విచారణ పూర్తి చేస్తాం అని కమిషనర్‌ మీడియా ద్వారా స్పష్టం చేశారు. మరోవైపు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన పేపర్‌, ఇవాళ్టి హిందీ పరీక్ష పత్రం ఒక్కటే అని తేలిందనీ అయితే ఎక్కడి నుంచి బయటకు వచ్చిందో తెలియదంటూ వరంగల్, హన్మకొండ డీఈవోలు వాసంతి, అబ్దుల్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారనీఅన్నారు. హన్మకొండ జిల్లా పరిధిలోని ఓ పాఠశాలకు చెందిన టెన్త్‌ విద్యార్థుల వాట్సాప్‌ గ్రూప్‌లోనే పేపర్‌ పెట్టినట్లు తెలుస్తున్నాదని, అధికారికంగా అది ధృవీకరణ కావాల్సి ఉందనీ వెల్లడించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని సిపి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking