తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ గిరిజన దినోత్సవం

ఖమ్మం ప్రతినిధి జూన్ 17 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ గిరిజన దినోత్సవన్ని శనివారం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల ఖమ్మం హెచ్ ఓ ఆర్ ఎస్ బస్వాపురం నందు తెలంగాణ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు హౌసెస్ వారిగా క్విజ్ పోటీలు నిర్వహించి గెలుపొందిన హౌస్ విద్యార్థులకు బహుమాతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోటీలను డిప్యూటీ వార్డెన్ బి వెంకటేశ్వర్లు విద్యార్థులకు వివిధ గిరిజన ప్రజలకు సంబంధించిన వేషధారణ వేయించి వారి చేత గిరిజన నృత్య ప్రదర్శనలు ఎంతో అద్భుతంగా నిర్వహించారని ఎం సోమ్లా తెలిపారు.ఈ కార్యక్రమములో సీనియర్ ఉపాధ్యాయులు బి. కృష్ణా రావు, టి. మురళీరకరావు, ఆ సక్రామ్, డిప్యూటీ వార్డెన్ బి వెంకటేశ్వర్లు మరియు సి ఆర్ టీ ఉపాధ్యాయులు ఈ భాస్కర్,జి నాగేశ్వరరావు, ఐ నెహ్రూ, బి అశోక్ కుమార్, ఏ రాంకిషన్ హాస్టల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking