పైలెట్ ప్రాజెక్టులో భాగంగా పక్కా ప్రణాళికతో డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే అమలు
ఇందుకుగాను జిల్లాలో( 11) బృందాల ఏర్పాటు
డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వేకు ప్రజలు సహకరించాలి
మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు
ప్రజా బలం దినపత్రిక మెదక్ జిల్లా ప్రతినిధి
02.10.2024
జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే నిర్వహించడానికి పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నామని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
బుధవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుండి డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే ఉద్దేశించి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మెదక్ జిల్లాలో ప్రతి కుటుంబానికి డిజిటల్ ఫ్యామిలీ కార్డు. సర్వే చేపట్టడంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ మెదక్ జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో
మెదక్, నర్సాపూర్ ఈ సర్వే చేపట్టేందుకు
ఒక్కో బృందంలో (04) అధికారులు చొప్పున 11 బృందాలు సీనియర్ అధికారి నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
మెదక్ జిల్లాలో శంకరంపేట ఆర్ మండలం కామారం గ్రామంలో, మెదక్ మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ -20 డేహెరా మున్సిపాలిటీ పరిధిలో , నర్సాపూర్ నియోజకవర్గంలో గొల్లపల్లి గ్రామం, నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో వార్డ్ నెంబర్ 8 హనుమాన్ వీధి ప్రాంతాలలో ప్రతి కుటుంబానికి డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే ప్రారంభిస్తున్నట్లు వివరించారు.
క్షేత్రస్థాయిలో డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వే నిర్వహణ 11 బృందాలు అత్యంత పారదర్శకంగా ఈ సర్వే నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సర్వే నిర్వహణకు వచ్చిన బృందాలకు ప్రజలు వారి కుటుంబాలకు సంబంధించిన అన్ని వివరాలు అధికారులకు సమగ్రంగా అందజేయాలని చెప్పారు.
ఈ డిజిటల్ ఫ్యామిలీ కార్డు సర్వేకు విజయవంతంగా నిర్వహణకు అధికారులకు ప్రజలు సహకరించాలన్నారు.