డ్రగ్స్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ ఎ డి కి ఖమ్మం ప్రెస్ క్లబ్ వినతి
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 01 (ప్రజాబలం) ఖమ్మం మెడికల్ షాపులలో మందుల కొనుగోలుపై 20 శాతం మేర రాయితీ కల్పించాలని ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు ఆధ్వర్యంలో జర్నలిస్టుల ప్రతినిధుల బృందం ఉమ్మడి ఖమ్మం జిల్లా డ్రగ్స్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జి. ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు.
శనివారం నూతన కలెక్టరేట్ లో ఏ డి జి. ప్రసాద్ ను జర్నలిస్టుల బృందం కలిసి జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సు కోసం విధి నిర్వహణలో జర్నలిస్టులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇటు ప్రభుత్వానికి ఆటు ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టులు , వార్త సేకరణలో భాగంగా అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని తెలిపారు.
ప్రజాస్వామ్యం పరిరక్షణకు పాటుపడే ఫోర్త్ ఎస్టేట్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు రాయితీ రూపేనా చేయూతను జనరల్ మెడికల్ షాపులు, ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్న మెడికల్ షాపులలో 20 శాతం రాయితీ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సారధ్యంలో టి యు డబ్ల్యూ జే ( టి.జె.ఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ సూచన మేరకు జర్నలిస్టుల శ్రేయస్సు కోసం అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా డ్రగ్స్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ జి. ప్రసాద్ స్పందిస్తూ… వార్త సేకరణలో భాగంగా జర్నలిస్టులు నిరంతరం పనిచేస్తూనే ఉంటారని, వారి ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకొని అన్ని మెడికల్ షాపులలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు రాయితీ కల్పించేందుకు తప్పకుండా కృషి చేస్తానని జర్నలిస్టులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జె (టి.జె.ఎఫ్) జిల్లా ఉపాధ్యక్షులు టీ ఎస్ చక్రవర్తి, ప్రెస్ క్లబ్ కోశాధికారి బిక్కీ గోపి, సహాయ కార్యదర్శి లు జీవన్ రెడ్డి, పానకాలరావు, ఉపాధ్యక్షులు ముత్యాల కోటేశ్వరరావు, ప్రజా జ్యోతి శ్రీనివాస్, వేల్పుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.