వీ ఆర్ ఫర్ యు వయోజన సభ్యుల సంస్థ ఆధ్వర్యంలో రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గమ్, మణికొండ మునిసిపల్ కౌన్సిల్ పరిధిలోని గవర్నమెంట్ హై స్కూల్ పైప్ లైన్ రోడ్ కూడలి బస్ స్టాండ్ వద్ద చల్లటి చిక్కటి మజ్జిగ వితరణ చేయడం జరిగిందని సంస్థ అధ్యక్షుడు బత్తుల బాపూజీ తెలియ జేసినారు, ఈ సందర్భముగా సంస్థ కార్యదర్శి డీ యస్ ఆర్ దాస్, కోశాధికారి దిలీప్ కక్కడ్, అందె లక్ష్మణ్ రావు, సాంబశివ రావు, నాగేంద్ర రావు, విజయలక్ష్మి తదితర సంస్థ సభ్యులే కాక పేరుగాంచిన అడ్వకేట్ ఎస్ వీ రత్నం మరియు పుర జనులు సేద తీర్చుకొని కార్యక్రమంలో పాల్గోన్నారు.