ఖమ్మం ప్రతినిధి జూన్ 27 (ప్రజాబలం)ఖమ్మం జిల్లాలో ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగవంతం చేసినట్లు అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ అన్నారు. గురువారం అదనపు కలెక్టర్, కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ధరణి దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ధరణి పెండింగ్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రతిరోజు పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి రోజువారి లక్ష్యం ఏర్పరచుకొని, తదనుగుణంగా కార్యాచరణ చేస్తున్నట్లు తెలిపారు. తహశీల్దార్లు, ఆర్డీవోలు తమ తమ లాగిన్ లో ఉన్న ఫైళ్ల పరిశీలన త్వరితగతిన పూర్తికి ఆదేశాలు ఇచ్చి, రోజువారి పరిష్కార పర్యవేక్షణ చేస్తున్నట్లు ఆయన అన్నారు. తహశీల్దార్ల పరిశీలన తర్వాత ఆర్డీవోల లాగిన్, అక్కడి నుండి అదనపు కలెక్టర్ లాగిన్ కి వస్తాయని, ఫిజికల్ ఫైళ్ల పరిశీలన చేసి, కలెక్టర్ కు పరిష్కారానికి ఫార్వార్డ్ చేస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు