ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. మంగళవారం నిర్మల్ పట్టణం లోని బాగులవాడ, సోమవార్ పేట్ ప్రాథమిక ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా పాలనాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా ప్రతీ గది పరిశీలిస్తూ విద్యార్థుల హాజరు నమోదు, త్రాగునీరు, టాయిలెట్స్, తదితర సౌకర్యాల పై ప్రధానోపాధ్యాయులును అడిగి తెలుసుకున్నారు.
టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థుల కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని తెలిపారు.