నిర్మల్ జిల్లా లో భారీ నుండి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పాలనధికారి వరుణ్ రెడ్డి అన్నారు
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. వాతావరణ శాఖ నిర్మల్ జిల్లాను రెడ్ అలర్ట్ గా ప్రకటించిన సందర్బంగా
ధన, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాలోని
సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేస్తూ, పరిస్థితులను ఎదుర్కొనేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఇరిగేషన్ అధికారులు వారి వారి పరిధిలోని చెరువులు,కుంటలు, నీటి వనరులపై పూర్తి అవగాహన కలిగి వుండాలని,వాగులు కల్వర్టుల వద్ద ప్రవాహం అధికమైన చోట రాకపోకలు జరపకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.వర్షం లో చేపలు పట్టుటకు వెళ్లరాదని .లోతట్టు ముంపు ప్రదేశాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
అధికారులు హెడ్ క్వార్టర్ లో ఉంటూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి తెలిపారు.
జిల్లా సమికృత కలెక్టరేట్ లో
అత్యవసర హెల్ప్ లైన్ నంబర్ 9398749227 ఏర్పాటు చేయనైనదని, ఈ హెల్ప్ లైన్ నంబర్ 24 గంటలు పనిచేస్తుందని జిల్లా పాలనాధికారి తెలిపారు.