ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను హెచ్చరించారు

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..సోమవారం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాలనుండి వచ్చిన ప్రజల నుండి ఆమె అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ,ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు శాఖల వారిగా పెండింగ్ లో ఉన్న జిల్లా ప్రజావాణి, సీఎం ప్రజావాణి దరఖాస్తుల పరిశీలన చేపట్టి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ధరణి, రెవెన్యూ, వ్యవసాయం,కొత్త రేషన్ కార్డులు, ఫించన్లు,డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇతర భూ సమస్యల వంటి అంశాలపై ఫిర్యాదులు అధికంగా వచ్చాయని సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ శాఖలలో కోర్టు కేసులకు సంబందించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.అలాగే వర్ష్యకాలం నేపథ్యంలో వ్యాపించే సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వర్షపు నీరు నిలువ ఉండే ప్రదేశాలు, డ్రైనేజీలలో యాంటీ లార్వా వృద్ధి చెందకుండా నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రతి మంగళ, శుక్రవారాలలో క్రమం తప్పకుండా డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వివిధ ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థులకు ఫీవర్ సర్వేను నిర్వహించి రిపోర్టును అందజేయాలని సూచించారు ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్,డీ.ఆర్ఓ భుజంగ్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking