వివిధ కారణాల వల్ల లబ్ధిదారులకు చెల్లింపులు లేక ఆగిన ఆసరా పెన్షన్ల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆదేశం

 

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 27 (ప్రజాబలం) ఖమ్మం సోమవారం ఐడిఓసి లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపీడీఓ లు, తహశీల్దార్లతో ఆసరా పెన్షనుల మంజూరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ కారణాల ఆగిపోయిన ఆసరా పెన్షన్ల విషయంలో క్షేత్ర స్థాయిలో పరిశీలనలు చేసి, అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. భర్త ఆసరా పెన్షన్ లబ్దిదారుడిగా ఉండి మరణిస్తే, భార్యకు అట్టి పెన్షన్ వర్తించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఇట్టి తక్షణ వృద్దాప్య పెన్షన్లు 810 ఉన్నాయని వెంటనే క్షేత్ర పరిశీలనలు చేసి చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. మరణ ధ్రువీకరణ పత్రం ఆధారంగానే ఆసరా పెన్షన్ల తొలగింపు చేయాలని ఆయన అన్నారు. గత ఒకటిన్నర సంవత్సరం నుండి మరణించిన వారి పెన్షన్లు తొలగింపు జాబితా లోని కేసులన్నీ తిరిగి క్షేత్ర స్థాయిలో సర్వే చేపట్టి, ఎక్కడైనా పొరపాట్లు జరిగివుంటే, వెంటనే దిద్దుబాటు చర్యలు చేయాలన్నారు. జిల్లాలో ఆధార్ మ్యాపింగ్ కాని పెన్షన్లు 628 ఉన్నట్లు, వెంటనే అట్టి వానిని ఇకెవైసి లో అప్ డేట్ చేసి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒకే ఇంట్లో 2 పెన్షన్లు ఉన్న కారణంతో 110 పెన్షన్లు స్టేట్ నుండి తిరస్కరించబడ్డాయని, అట్టి వానిని తనిఖీలు చేసి, ఒకే ఇంట్లో వికలాంగ, వృద్దాప్య పెన్షన్లుగా ఉంటే అర్హులుగా పరిగణించి రోల్ బ్యాక్ కొరకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. పెన్షన్ల విషయంలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. ఉపాధి హామీ పనుల్లో మెటీరియల్ కాంపోనెంట్ కి సంబంధించి చెల్లింపుల జనరేట్ చేయాలన్నారు. గ్రామ పంచాయితీల అభివృద్ధికి మంజూరు అయిన రూ. 10 లక్షల పనుల విషయంలో ప్రతిపాదనలు సిద్ధం చేసి, వెంటనే సమర్పించాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, డిఆర్డీవో విద్యాచందన, ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, డిపిఎం రేవతి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking