ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

 

ఖమ్మం ప్రతినిధి అక్టోబర్ 6 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలిం చడం కోసం ప్రభుత్వం ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఖమ్మం రూరల్ మండలం, జలగం నగర్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు అల్పాహారం వడ్డించి వారితో కలిసి అల్పాహారం చేశారు. అల్పాహారం నాణ్యత, రుచిపై కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు విద్యార్థులకు మెనూ ప్రకారం నచ్చిన టిఫిన్ పెట్టాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రతిరోజు పిల్లలు ఉదయమే పాఠశాలకు వచ్చి చేతులు మంచిగా శుభ్రం చేసుకొని అల్పాహారం స్వీకరించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రారంభించడం సంతోషకరమని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు అల్పాహారాన్ని అందించడం జరుగుతుందని, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యతతో అందించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించడం వల్ల వారి ఎదుగుదలకు దోహదపడడంతో పాటు తరగతి గదిలో విద్యార్థుల ఏకాగ్రత మెరుగవుతుందని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఏ. సోమశేఖరశర్మ, విద్యా శాఖ ఇ ఇ నాగ శేషు, ఖమ్మం రూరల్ మండల ఎంఇఓ శ్యాoసన్, తహసీల్దార్ రామకృష్ణ, ప్రధానోపాధ్యా యులు, ఉపాధ్యాయులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking