ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్ష నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ఖమ్మం ప్రతినిధి జనవరి 29 (ప్రజాబలం) ఖమ్మం ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం నూతన కలెక్టరేట్‌ సమావేశమందిరంలో ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌, థీయరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్‌ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇంటర్మీడియట్‌ ద్వీతియ సంవత్సరం చదువుతున్న సైన్స్‌ విద్యార్ధులకు, వోకేషనల్‌ మొదటి, రెండవ సంవత్సరం విద్యార్దులకు ప్రాక్టికల్‌ పరీక్షల నిర్వహణకు తేది.01`02`2024 నుండి 15`02`2024 వరకు 76 కేంద్రాలలో రెండు సెషన్స్‌లో నిర్వహించడం జరుగుతుందని, ఆంగ్ల ప్రాక్టికల్‌ పరీక్షను తేది.16`02`2024న ఉదయం 09 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 02.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ఈ పరీక్షలకు జనరల్‌ విద్యార్దులు 13,194 మంది, వోకేషనల్‌ ఎడ్యుకేషన్‌ మొదటి సంవత్సరం విద్యార్దులు 24, రెండవ సంవత్సరం 2188 మంది విద్యార్దులు పరీక్షకు హాజరు కానున్నారన్నారు ప్రతి ప్రయివేటు కళాశాలలో డివోలను 4 ఫ్లయ్యింగ్‌ స్క్వాడ్‌ బృంధాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలకు హజరయ్యే విద్యార్దుల హాల్‌టికెట్స్‌ ఆపితే శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. విద్యార్ధులు హాల్‌ టికెట్లలో ఉన్న పరీక్ష తేదీలు, సమయాలను పరిశీలించు కోవాలన్నారు. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్దులకు ఈ సంవత్సరం ఇంగ్లీషు ప్రాక్టికల్స్‌ ప్రవేశ పెట్టడం జరిగిందని, ఈ పరీక్షలకు 16-02-2024న ఆయా కళాశాలలలో నిర్వహిస్తారన్నారు ఎథిక్స్‌ మరియు హ్యూమన్‌వ్యాల్యూస్‌ పరీక్ష 17-02-2024 ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 1.00 గంట వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు థియరీ పరీక్షలు ఫిబ్రవరి,28 నుండి మార్చి,16 వరకు ఉదయం 9.00 గంటల నుండి 12.00 గంటల వరకు నిర్వహించబడ తాయన్నారు. దీనికి గాను జిల్లాలో 70 పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుంద న్నారు ప్రధమ సంవత్సరం 18,468 మంది విద్యార్దులు, దీతీయ సంవత్సరం 18.072 మంది విద్యార్దులు పరీక్షకు హాజరుకానున్నారని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, సమీపంలోని జిరాక్స్‌ షాపులను మూసివేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సెల్‌ఫోన్‌లు అమనుతి లేదని, ఎలాక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ అనుమతించబడవని ఈ విషయాన్ని విద్యార్దులు, వారి తల్లిదండ్రుల గమనించాల్సింది గా కలెక్టర్‌ తెలిపారు సమావేశంలో అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌నాయక్‌, జిల్లా ఇంటర్‌మీడియాట్‌ విద్యాశాఖ అధికారి రవిబాబు, జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ, జిల్లా కోశాధికారి సత్యనారాయణ, ఏసిపి ప్రసన్న కుమార్‌, ఎస్టీ. ఎస్సీ, బిసి గురుకులాల ఆర్‌సిఓలు, ఆర్టీసి, విద్యుత్‌, పోస్టల్‌ శాఖ సూపరింటెండెంట్‌ బి.రవికుమార్‌, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking