జులం ప్రదర్శిస్తున్న కార్పొరేటర్ భర్త నుండి నన్ను కాపాడండి
విలేకర్ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన షేక్ వలి
ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 16 (ప్రజాబలం) ఖమ్మం నగరంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటి మేయర్ భర్త బెదిరింపుల బాధితుడు 4వ డివిజన్ బి.ఆర్.ఎస్. పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ వలి మాట్లాడుతూ తాను ప్రభుత్వ అనుమతుల తో టెండర్ ప్రకారం మున్సిపాలిటి పరిధిలో 2023 లో లీగల్ గానే నేను షాపు పొందితే ఆనాడు బి.ఆర్.ఎస్. పార్టీలో కొనసాగిన డిప్యూటి మేయర్ భర్త నేడు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, తనపై అక్కస్సుతో నాకు వచ్చిన మున్సిపల్ షాపును కావాలనే దురుద్దేశంతో కక్ష్యపూరితంగా నా షాపును క్యాన్సిల్ చేయించినని నన్ను బెదిరిస్తూ తనను వచ్చి కలవాలని కలవకపోతే మరోలా ఉంటుంది ఫోన్లో బెదిరింపులకు పాల్పడుతూ నాపై దూష పదజాలాలు వాడిన ఖమ్మం డిప్యూటి మేయర్ భర్తపై చర్యలు తీసుకోవాలని , బి.ఆర్. ఎస్. పార్టీ ఖమ్మం 4వ డివిజన్ ప్రధాన కార్యదర్శి షేక్ వలి ప్రభుత్వాన్ని కోరారు . తాను వాణిజ్య సముదాయాల భవనాలకు సైన్బోర్డ్స్, స్టీల్ లెటర్స్ వృత్తిని ఎంచుకుని జీవనం కొనసాగిస్తున్నానని , ఈ నేపధ్యంలో ఆనాటి బి. ఆర్.ఎస్. పార్టీ హయాంలో 2023 లో మున్సిపాలిటి పరిధిలో గల షాపును టెండర్ల ప్రకారం తాను అధికారికంగా , లీగల్గా షాపును పొందానని , అయితే నాపై కక్ష్యపూరితంగా అక్కస్సుతో , ప్రస్తుత ఖమ్మం డిప్యూటి మేయర్ భర్త నాకు షాపు దక్కకుండా చేసేందుకు కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు . తాను అధికారికంగా పొందిన షాపుపై తన అధికార పార్టీ జులుంను నాపై ప్రదర్శిస్తూ తనను కలవాలని , తన డివిజన్లో షాపు వచ్చినందుకు ఆయనను ప్రదక్షిణలు చేసుకోవాలని , కలవకపోతే , ఆయనను అయ్యా , అప్ప అని బ్రతిమిలాడుకోకపోతే నీ అంతు చూస్తానని , చరవాణిలో తనను బెదిరించారని ఆరోపించారు . కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అందరూ ఈ నాయకుడులా లేరని , సమాన సామాజిక వర్గం అయినప్పటికి కక్ష్యపూరిత ధోరణి తమపై వ్యవహరిస్తున్నందుకు బాధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు . తాను అనధికారికంగా మున్సిపాలిటి పరిధిలో షాపును పొందితే డిప్యూటి మేయర్ భర్త నాపై ఎలాంటి చర్యలు తీసుకున్నా, నేను సిద్ధంగా ఉన్నానని , అయినా కూడా భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ అధికారులు సూచించిన విధంగా నడుచుకోవాలా ? లేదా ? వీరు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగ ప్రకారంగా నడవాలా ? అనేది సందేహంగా మారిందని, ప్రభుత్వపరంగా, లీగల్ గా వచ్చిన నా షాపు నాకు దక్కకుండా కుట్రపన్నుతున్న డిప్యూటి మేయర్ భర్త బెదిరింపుల నుండి నన్ను కాపాడాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు ఈ విలేకర్ల సమావేశంలో చరణ్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు