రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 2 ఫిబ్రవరి 2025
కృషి ఫౌండేషన్ ఆద్వర్యంలో మణికొండ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీ కమ్యూనిటీ హాల్ లో రక్తదాన శిబిరం నిర్వహించినారు, ఇట్టి శిబిరం ఎర్ర రక్త కణాలలో హిమోగ్లోబిన్ లోపంతో, రక్తహీనతతో, వారసత్వ రక్త రుగ్మత భాదిత తలసేమియా బాధిత పిల్లల సహాయం కొరకు తాను కూడా రక్తదానం చేయడమైనదని ఫౌండేషన్ చైర్ పర్సన్ రూపా రెడ్డి తెలుపుతూ, ఈ శిబిరంలో 34వ పర్యాయం రక్తదానం చేసిన ఉప్పర కిరణ్ కుమార్ తో పాటు సంగం శ్రీకాంత్, రవి సాగర్, ఎల్లస్వామి, భాను చందర్, షేక్ ఆరీఫ్ తది తరులు రక్త దానం చేయడం జరిగినదని ఫౌండేషన్ ఉపాధ్యక్షురాలు నమ్రతా రెడ్డి తెలియజేసి కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు సీతారాం ధూళిపాళ, సీతారాం దాస్, భాగ్యలక్ష్మి కాలనీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నాయుడు, సుమ నళిని, అందె లక్ష్మణ్ రావు, ఉపేందర్నాధ్ రెడ్డి, దిలీప్ కక్కడ్ లను సమయోచితంగా సత్కరించడం, రక్త దాతలకు సర్టిఫికెట్లు అందజేయడం, శిబిరంకు కావలసిన ఏర్పాట్లలో సహకరించి కార్యక్రమాన్ని జయప్రదం గావించిన వారికి హృదయ పూర్వక ధన్యవాదములు తెలియ చేసారు.
