హైదరాబాద్ ప్రజాబలం ప్రతినిధి:తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఐ.టీ మరియూ మునిసిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అధ్యక్షతన రెండు పడకగదుల ఇండ్ల సమీక్షా సమావేశం జరిగినది, మొదటి దపా పంపిణీ చేసిన విధంగానే రెండవ విడత కూడా ఈనెల 15న జిల్లా కలెక్టర్ ల ఆధ్వర్యంలో లక్కీ డ్రా ద్వార లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని వాటిని 21వ తేదీ లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని తెలిపడం జరిగినది, ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ యాదవ్, హోమ్ మంత్రి మహమూద్ అలీ, మంత్రి సబితా ఇంద్రా రెడ్డి లతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, సుధీర్ రెడ్డి, మాగంటి గోపినాథ్, కాలేరు వెంకటేష్, రాజా సింగ్, జిల్లా కలెక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.