డా. ఏ పి జె అబ్దుల్ కలామ్ గారి జీవితం ఆదర్శనీయం

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..

 

నిర్మల్ జిల్లా కేంద్రం లోని ఈద్ గామ్ చౌరస్తా వద్ద డా.ఏ పి జె అబ్దుల్ కలామ్ ఎడ్యుకేషనల్ & వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యం లో భారత మాజీ రాష్ట్రపతి డా. ఏ పి జె అబ్దుల్ కలామ్ గారి 93 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ అజహరుద్దీన్ మాట్లాడుతూ స్వర్గీయ ఏ పి జె అబ్దుల్ కలామ్ గారు భారత దేశానికి నిస్వార్థ సేవ చేశారని వారి సేవలను గుర్తిస్తూ మున్సిపాలిటీ ద్వారా ఈద్ గామ్ చౌరస్తా వద్ద ఏ పి జె అబ్దుల్ కలామ్ గారి కాంస్య విగ్రహం తో పాటు వారు కనిపెట్టిన మిస్సయిల్ నమూనా ను వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.కౌన్సిలర్లు ఇమ్రాన్ ఉల్లా, ముజాహిద్ అలీ గారు మాట్లాడుతూ ఏ పి జె అబ్దుల్ కలామ్ గారి నిస్వార్థ సేవలను గుర్తిస్తూ మున్సిపాలిటీ చైర్మన్ ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్లందరి సహకారం తో కాంస్య విగ్రహం తో పాటు మిస్సయిల్ నమూనాను తప్పకుండా అతి త్వరలో ఈద్ గామ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేస్తామని తెలిపారు. టి ఎన్ జి ఓ నిర్మల్ అధ్యక్షులు ప్రభాకర్ మాట్లాడుతూ ఏ పి జె అబ్దుల్ కలామ్ గారు రాష్ట్రపతి పదవి కే వన్నె తెచ్చారన్నారు. ముఫ్తి ఆహెసాన్ షా మాట్లాడుతూ ఏ పి జె అబ్దుల్ కలామ్ మహనీయుడని కొనియాడారు.
ఈ జయంతి వేడుకల్లో సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మహమ్మద్ అజహరుద్దీన్, ఉపాధ్యక్షులు మహమ్మద్ అన్వర్, షబ్బీర్ అహ్మద్, కార్యదర్శులు మహమ్మద్ మసూద్,మహమ్మద్ రఫీ,అబ్దుల్ జావీద్, రయీస్ అహ్మద్, అబ్దుల్ వాజీద్,జరీఫ్, అంజద్,మునిసిపల్ కౌన్సిలర్లు ఇమ్రాన్ ఉల్లా,ముజాహిద్ అలీ,అబ్దుల్ సయీద్, సయ్యద్ అబ్రార్, అబ్దుల్ మతీన్, ముజాహిద్ చౌష్, అబ్దుల్ మజీద్, అన్వర్,రఫీ,మాజీ మునిసిపల్ చైర్మన్ అజీమ్ బిన్ యాహియా,టి ఎన్ జి ఓ నిర్మల్ అధ్యక్షులు ప్రభాకర్,ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్,ముఫ్తి ఆహెసాన్ షా, బిఆర్ఎస్ నాయకులు మహమ్మద్ నజీర్, మహ్మద్ బిన్ అలీ , ఎం.ఐ.ఎమ్.పార్టీ నాయకులు సయ్యద్ చాంద్ పాషా, ఇంతియాజ్,కలామ్ గుణం యూత్ మరియు వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు మహమ్మద్ ఉస్మాన్, కార్యదర్శి ఇంతియాజ్ అహ్మద్,అబ్దుల్ ఖదీర్,ఎక్తా వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థపకులు మహమ్మద్ ముజాహిద్ మరియు పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking