ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో ఫ్రెండ్స్ హెల్పింగ్ సొసైటీ తరపున ప్రముఖ పునరావాస మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మరియు జానపద గాయకుడు డా. జనార్దన్ పన్నెల గారిని ఘనంగా సన్మానించడం జరిగింది.
డా.జనార్దన్ అమెరికాలో నివసిస్తూ, మన తెలంగాణ నుంచి అమెరికాకు వెళ్తున్న కళాకారులకు తన నివాసంలో బస అందిస్తూ,వారిని ప్రోత్సహిస్తూ,నేను ఉన్నాను”అనే భరోసాతో సహాయానికి ఎప్పుడూ ముందుంటారు. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో జనార్దన్ గారు ఎనలేని పాత్ర పోషిస్తున్నారు.
అలాంటి సేవా మూర్తిని మరియు జానపద గాయకుడిని సన్మానించడం ఫ్రెండ్స్ హెల్పింగ్ సొసైటీకి గౌరవంగా భావిస్తున్నాము
Prev Post
Next Post