ఆక్టివ్ లేబర్లో 50 శాతం లేబర్ మొబ లైజేషన్ కావాలి
పెట్టిన చెట్లను సంరక్షించాలి
వైకుంఠ రథాలు వైకుంఠధామాలను వినియోగంలోకి తీసుకురావాలి
చెత్త అమ్మకం ద్వారా ఆదాయం పెంచుకోవాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

సంగారెడ్డి ఫిబ్రవరి 8 ప్రజాబలం ప్రతినిధి:
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఈనెల 28 లోగా వంద శాతం పన్ను వసూళ్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ పంచాయతీ కార్యదర్శులకు ఆదేశించారు.
బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఏపీ డి లు, డి ఎల్ పి ఓ లు ,ఎంపీ ఓలు, ఎంపీడీవోలు, ఏపీవోలు, పంచాయతీ సెక్రెటరీ, తదితరులతో వివిధ అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఆక్టివ్ లేబర్లో 50 శాతం లేబర్ మొబ లైజేషన్ చేయాలని స్పష్టం చేశారు. చేసిన పనికి సంబంధించి ప్రాపర్ గా రికార్డు చేయాలన్నారు. పనిచేసిన దానికి సంబంధిత లేబర్ లకు పే స్లిప్స్ ఇవ్వాలని సూచించారు. ఈజీఎస్ కింద ప్రతి గ్రామపంచాయతీలో కనీసం 20 పనులు
శ ల్ఫ్ లో ఉండాలని , శ్రమ శక్తి సంఘాలతో సమావేశం నిర్వహించి ఆయా పనుల లిస్టును ఇవ్వాలన్నారు.
ఫీజిబుల్ వర్క్స్ ఉండాలని తెలిపారు. పలువురు పంచాయతీ సెక్రెటరీల అలసత్వం నిర్లక్ష్య ధోరణిపై కలెక్టర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ప్రతి వ్యక్తికి జీవించే హక్కు లాగే పని చేసే హక్కు ఉందన్నారు. పని కల్పించాలని అడిగిన వారికి ఈ జీ ఎస్ లో 15 రోజుల్లోగా పని కల్పించాలన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని సూచించారు.
చెత్త అమ్మకంతో గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూరాలని తెలిపారు. ప్లాంటేషన్ కు రెగ్యులర్గా వాటరింగ్ చేయాలని ఆదేశించారు. ట్యాంకర్ ద్వారా వాటరింగ్ చేయడంతో ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరుతుందని, ఆ దిశగా ఎంపీడీవోలు, ఎంపీలు, పంచాయతీ కార్యదర్శులు దృష్టి సారించాలన్నారు. ట్యాంక్ ద్వారా చెట్లకు నీరు పట్టడం ద్వారా గ్రామపంచాయతీకి ఎంత ఆదాయం వచ్చిందన్న వివరాలు సమర్పించాలని
సూచించారు.మొక్కలను సంరక్షించాలని, ప్రత్యేకించి రోడ్ సైడ్ ప్లాంటేషన్ రెవెన్యూ ప్లాంటేషన్ సరిగ్గా ఉండాలన్నారు. మొక్కలను మీరు కాపాడండి మొక్కలు మిమ్మల్ని కాపాడుతాయని హితవు పలికారు.
వైకుంఠధామాలు, వైకుంఠ రథాలు వినియోగంలోకి తీసుకురావాలన్నారు. వైకుంఠధామాల చుట్టూ బయోఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రతిరోజు ఇంటింటి చెత్త సేకరణ జరగాలని, సెగ్రీ గేషన్ జరగాలని, తడి చెత్త కంపోస్ట్ తయారు కావాలని, తడి పొడి చెత్త అమ్మకంతో గ్రామపంచాయతీలకు ఆదాయం సమకూరాలన్నారు. వచ్చిన ఆదాయంలో పంచాయతీ కార్మికులకు అవసరమైన నూనె, సబ్బులు తదితర వస్తువులతో కిట్ ఇవ్వాలని సూచించారు.
ఆసరా పింఛన్లకు అర్హత ఉన్న ఎవరు మిస్ కావద్దని, ఉంటే గుర్తించి వారి దరఖాస్తులను ఈనెల 23 లోగా ఎంపీడీవోలకు పంపాలని పంచాయితీ కార్యదర్శులకు సూచించారు. ఆయా ప్రతిపాదనలను వెంటనే
డి ఆర్ డి ఓకు సమర్పించాలని ఎంపీడీవోలకు ఆదేశించారు. పింఛన్లకు సంబందించి ఎలాంటి పెండింగ్ ఉండరాదన్నారు.
నర్సరీలు వంద శాతం జర్మినేషన్ కావాలన్నారు.
ఎంపీడీవోలు,ఎం పి ఓ లు ఆయా విషయాలలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేష్ మోహన్, డి ఆర్ డి ఓ శ్రీనివాస రావు, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, అదనపు పీడీలు,
డి ఎల్ పి ఓ లు, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, ఏపీఎంలు, తదితరులు పాల్గొన్నారు.