ఎగ్జిబిషన్లో కరువైన రక్షణ..?

 

కానరాని ఫైర్ సేఫ్టీ పరికరాలు..

ఎస్కెపింగ్ దారులు నిల్…

కాలం చెల్లిన పరికరాలతో ఎగ్జిబిషన్ నిర్వహణ

నాసిరకం విద్యుత్ పరికరాలు

పట్టించుకోని ఫైర్ డిపార్ట్మెంట్

జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 25 (ప్రజా బలం) కాలక్షేపం కోసం ఎగ్జిబిషన్ పోదామని ఎందరో ప్రజలు ఆలోచిస్తుండగా అక్కడ పొంచివున్న ప్రమాదం ప్రజల ఆలోచనలకు చిక్కడంలేదు. ప్రజలకు భద్రతతో ఎగ్జిబిషన్ నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిన ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు నిర్లక్ష్యం నీడన సెదతీరుతుంటే ఎగ్జిబిషన్లో ఎప్పుడు ఏమవుతుందోనన్న ఆందోళన నెలకొన్న సంఘటన ఇది. జగిత్యాల జిల్లా కేంద్రాల్లోని కరీంనగర్ రోడ్డులో దసరా తరువాత ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. తొలితనే అక్కడికి వెళ్లిన ప్రజలను పాములు దర్శనమిచ్చినట్లు తెలిసింది. ఇలా ఏర్పాటైన ఎగ్జిబిషన్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలకు నీ ల్లోదిలినట్లు తెలిసింది. వందలాది మంది సందర్శకులు వచ్చే ఈ ఎగ్జిబిషన్ లో కేవలం ప్రైవేట్ స్కూల్ బస్సుల్లో ఉంచే చిన్నపాటి ఫైర్ సిలిండర్ నే ఏర్పాటు చేయడం కనిపిస్తోంది. ఎగ్జిబిషన్ నిబందనల ప్రకారం నాలుగు ఏక్సిట్ దారులుండాలని తెలుస్తోంది. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే అందులోని వారిని తక్షణమే బయటకీ పంపించేందుకు తోడ్పడుతుందని సమాచారం. కాగా ఈ ఎగ్జిబిషన్ లో కేవలం ఒకదారి మాత్రమే ఎగ్జిబిషన్ నిబంధనల క్రిందికి సరిపోతుందన్నటు తెలుస్తోంది. అలాగే చిన్న చిన్న బకిట్లలో ఇసుక వుండాలన్న నిబంధనలు ఉన్నా వాటి అమలు ఎగ్జిబిషన్లో కానరావడం లేదన్నట్లు తెలుస్తోంది. అలాగే ఎగ్జిబిషన్లో నాలుగు దిక్కులా నాలుగు ఐదు వందల లీటర్ల నీటి డ్రంబులలో నీటి నిల్వ ఉంచి వీటిని ఎత్తైన స్టాండులపై అమర్చాలని ఎప్పుడైనా అగ్నిప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్లు వచ్చే వరకు మంటలను ఆర్పేందుకు సిద్ధంగా ఉంచాలన్నట్లు నిబంధన ఉన్నట్లు తెలిసింది. కానీ ఎగ్జిబిషన్లో ఇలాంటి ఏర్పాట్లు ఎక్కడ కానరావడం లేదన్నట్లు తెలిసింది.ఇలాంటి ఏర్పాట్లు లేకుండానే ఎగ్జిబిషన్ కొనసాగుతుండగా ఫైర్ అధికారులు పట్టిచుకొన్న దాఖలాలు కనిపిస్తలేదన్నట్లు తెలుస్తోంది. ఇక నాణ్యమైన విద్యుత్ వైర్లతో పూర్తి ఎగ్జిబిషన్ కీ విద్యుత్ సరఫరా బోర్డు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా ఇక్కడ ఆ నిబంధనకు నీళ్లొదినట్లు తెలుస్తోంది. నాసిరకం, పురాతన వైర్లతోనే ఎగ్జిబిషన్లో విద్యుత్ సరఫరా కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇక వినియోగదారుల కోసం ఏర్పాటు చేసిన జాయింట్ వీల్, కొలంబస్, బ్రేక్ డాన్స్ వంటి పురాతన పరికరాలతోనే కోనసాగిస్తూ ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎప్పుడు ఏ పరికరం లింక్ తెగిపోంతుందోనన్న భయంతో ప్రజలు తమ సంతోషాన్ని భయం భయం గా పంచుకొంటున్నారు. ఇక ప్రతి వస్తువు ధర మార్కెట్ ధరకు ఎక్కువగా ఉన్నట్లు పలువురు సందర్శకులు అంటున్నారు. గతంలో వివిధ ప్రాంతాల్లో ఎగ్జిబిషన్లలో జరిగిన అగ్నిప్రమాదాలను గుర్తించి ఎగ్జిబిషన్ నిర్వణకు ప్రభుత్వాలు రూపొందించిన నిబంధనల ప్రకారం ఎగ్జిబిషన్ నిర్వహణ కొనసాగేలా జిల్లా అధికారులు చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking