– ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆదేశాల మేరకు పుస్తె మట్టేలు అందజేసిన బిజెపి నాయకులు
సిద్దిపేట జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఫిబ్రవరి 23 దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన పిడుగు లావణ్య గారి కూతురు వివాహం సందర్భంగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిని సహాయం చేయాల్సిందిగా గత కొన్ని రోజుల క్రితం వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారిని కోరగా, ఈరోజు వారి వివాహానికి స్థానిక బిజెపి నాయకుల చేతుల మీదుగా పుస్తె మట్టేలు అందజేయడం జరిగింది. తమ కూతురు వివాహానికి అడగగానే సహాయం చేసిన దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు గారికి లావణ్య కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ బిజెపి నాయకులు నరేందర్, వెంకటేష్, స్వామి, కమల్,గోపాల్, కుమార్, గిరీష్, ఎల్లం, సురేష్ తదితరులు పాల్గొన్నారు