అత్యవసర సమయంలో ప్రాణ రక్షణ విషయంగా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా కృషి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూన్ 19 : ప్రమాదాలలో గాయపడిన క్షత రాత్రులకు, గర్భిణులకు అత్యవసర సమయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా రక్తాన్ని అందించి ప్రాణం కావడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.జిల్లా నూతన కలెక్టర్ గా బాధితులు శ్రీకాంత్ చెందిన రెడ్ క్రాస్ సొసైటీ ప్రధాన కార్యదర్శి చందూరి మహేందర్,సొసైటీ సభ్యులతో జిల్లాలోని నస్పూర్ గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ఈ నెల 14న జరిగిన రక్త దాతల దినోత్సవం సందర్భంగా మంచిర్యాల రెడ్ క్రాస్ సొసైటీ గవర్నర్ అవార్డు పొందడం అభినందనమని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల ద్వారా రక్తనిధి కేంద్రం తల సేమియా సైకిల్ స్టైల్ బ్లడ్ ట్రాన్స్ మిషన్ సెంటర్, అనాధ-వృద్ధుల ఆశ్రమం లాంటి అనేక విధాలుగా సమాజానికి సేవలు అందించడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం మంచిర్యాల తరపున జిల్లా అధ్యక్షుడు గీట్ల సుమిత్, ప్రధాన కార్యదర్శి, కోమల గోవర్ధన్ తో,జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…ప్రభుత్వ కార్యాలయంలో నాలుగో తరగతి ఉద్యోగుల పాత్ర కీలకమని, అధికారులతో ఆదేశాలు మేరకు చిత్తశుద్ధితో విధులను నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కమిటీ సభ్యులు మధుసూదన్ రెడ్డి, జిల్లా కోశాధికారి సత్యపాల్ రెడ్డి కమిటీ సభ్యులు కాసల్ల శ్రీనివాస్,తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking