100 శాతం అక్షరాస్యత సాధన దిశగా కృషి చేయాలి

 

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 11 : జిల్లాలో 100 శాతం అక్షరాస్యత శాతాన్ని సాధించే దిశగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో అక్షరాస్యత శాతం పెంపొందించడంపై సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు వివిధ ప్రాంతాలలో న్యూ ఇండియా లిటరసీ కార్యక్రమం ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.జిల్లాలోని గ్రామీణ,పట్టణ ప్రాంతాలలో 1 లక్ష పైచిలుకు నిరక్ష్యరాస్యులు ఉన్నట్లుగా గుర్తించడం జరిగిందని, ఇందులో మొదటి విడతలో 20 వేల 425 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని,ఇందు కొరకు వాలంటరీ టీచర్లను గుర్తించి వారి ద్వారా వయోజనులకు విద్యాభ్యాసం అందించి అక్షరాస్యులుగా మార్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.వృత్తి శిక్షణ కేంద్రాల ద్వారా ఆకర్షించి వయోజనులను విద్యావంతులుగా మార్చాలని,వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా అందుబాటులో గల శిక్షకులను గుర్తించి వారికి కేటాయించిన లక్ష్యాలను సాధించే దిశగా సమన్వయంతో పని చేయాలని తెలిపారు.ఆన్లైన్ టీచింగ్,లర్నింగ్, అసెస్మెంట్ యాప్ ద్వారా నిరక్షరాస్యులు, వాలంటరీ శిక్షకుల వివరాలు నమోదు చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరుగుతుందని,ఈ యాప్ ద్వారా డిగ్రీ, జూనియర్ కళాశాలల విద్యార్థులు, అంగన్వాడీ టీచర్లు, పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు,ఆశా వర్కర్లు,ప్రభుత్వ ఉద్యోగులు తమ వివరాలు నమోదు చేసుకొని స్వచ్ఛందంగా నిరక్షరాస్యులకు విద్యాబోధన చేయవచ్చని తెలిపారు.వాలంటరీ టీచర్లకు 30 అక్షరాలతో కూడిన అక్షరమాలకు సంబంధించి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని,100 రోజులలో మొదటి విడతలోని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యంగా సమిష్టిగా పని చేయాలని తెలిపారు. ఎస్.సి., బి.సి. సంక్షేమశాఖల ఆధ్వర్యంలో నిర్వహించే వసతిగృహాల ఏర్పాటు కొరకు భూమిని గుర్తించేందుకు సంబంధిత రాజస్వ మండల అధికారులు, తహశిల్దార్ల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి నీరటి రాజేశ్వరి,షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పోటు రవీందర్రెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking