ప్రపంచ వయోవృద్దుల సంక్షేమ దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ హాల్లో వయోవృద్దుల కలయిక

ఖమ్మం ప్రతినిధి సెప్టెంబర్ 28 (ప్రజాబలం) ఖమ్మం అక్టోబరు 1 వ తారీఖున ప్రపంచ వయోవృద్దుల సంక్షేమ దినోత్సవం సందర్బంగా ఖమ్మం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలియ జేశారు నేటి సమాజంలో తల్లిదండ్రులు తాతలు అమ్మమ్మలు నాయన్నమ్మలు కనీసం తినడానికి భోజనం ఉండడానికి ఇంట్లో ఏదైన మూలకైనా ఉండనీయక పోవడం హృదయ విదాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వీటిన్నటిని దృష్టి లో ఉంచుకొని అక్టోబరు 1 న హృద్దులతో కూడిన సమావేశం జరుగుతుందని ఆయన తెలిపినారు..ఈ సమావేశానికి మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ , జిల్లా కలెక్టర్,, పోలీసు కమీషనర్,, సుడా చైర్మన్ బచ్చు విజయ కుమార్ ,జిల్లాపరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు,ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ జడ్జీ జావేద్ పాషా సర్జికల్ కేన్సర్ స్పెషలిస్టు డా వి. రవిచందర్ జిల్లా సంక్షేమ అధికారి సుమ ముఖ్య అతిథులుగా హాజర్ అవుతారు ఈ పత్రికా విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు తో పాటు సంఘం ప్రధాన కార్యదర్శి సాధినేని జనార్థన్ రావు కోశాధి కారి కొత్త సత్యనారాయణ రెడ్డి అశోషియేట్ అద్యక్షులు ఆర్. రవీందర్ రావు కార్యదర్శి అనాషి రాధాకృష్ణ తదితరులు హాజరైనారు

Leave A Reply

Your email address will not be published.

Breaking