ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 06 మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో శుక్రవారం గెస్ట్ ఫ్యాకల్టీ నూతన కమిటీని రాష్ట్ర,జిల్లా బాధ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యక్షులుగా పోరెడ్డి సత్యనారాయణ,ప్రధాన కార్యదర్శిగా బొడ్డుపెల్లి రవీందర్,జాయింట్ సెక్రటరీగా ఐలవేణి సౌమ్య, ట్రెజరర్ గా మునుకుంట్ల అపూర్వ,మీడియా అధికార ప్రతినిధిగా బోనగిరి కుమార్ లను ఎన్నుకున్నారు. నూతన కమిటీ సభ్యులను స్టేట్ గెస్ట్ ఫ్యాకల్టీ జనరల్ సెక్రటరీ తోట సతీష్,స్టేట్ కమిటీ ట్రెజరర్,జిల్లా గెస్ట్ ఫ్యాకల్టీ ప్రెసిడెంట్ ముడుసు మహేష్,స్టేట్ అడ్వజర్ కమిటీ మెంబర్ మగ్గిడి భవానిలు అభినందించి, నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ…గెస్ట్ ఫ్యాకల్టీకి ప్రతి నెల కాన్సలిడేటెడ్ శాలరీ,ఆటో రెన్యువల్ కొరకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో గెస్ట్ ఫ్యాకల్టీ అరుణ కుమారి,రాయలింగు, రజిత,స్వప్న,స్వర్ణలత, రమణ,విజయ్,అనిత, మౌనిక,ధరణి తదితరులు పాల్గొన్నారు.