మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ మీడియా సెంటర్ ను ప్రారంభించిన ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మార్చి 18:
పార్లమెంట్ ఎన్నికలు వెలువడిన నేపథ్యములో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా లోని మల్కాజిగిరి -07 పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్ మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ (ఎం సి ఎం సి), మీడియా సెంటర్ ను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎం సి ఎం సి పనితీరును సంబందించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలు సంబందించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనిటరింగ్ కమిటీ సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి అరుంధతి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ నాగాంజలి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking