-ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవ చూపాలి
ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 18 :
మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని అఖిలపక్ష నాయకులు అందుగుల శ్రీనివాస్, మేడిపల్లి సంపత్, ఆర్ వెంకన్న, ముల్కళ్ళ రాజేంద్రప్రసాద్, సురేష్ కుమార్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం విలేకరుల సమావేశంలో అఖిలపక్ష జేఏసీ నాయకులు మాట్లాడారు. మందమర్రి పట్టణంకు పాలకవర్గం లేకపోవడం వలన అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వాలు ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేశాయన్నారు. 1998లో మరో ఐదు రోజుల్లో మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగనుండగా ఊరు మందమర్రికి చెందిన రామచందర్ అనే వ్యక్తి కోర్టు నుండి స్టే తేవడంతో ఎలక్షన్లు ఆగిపోయాయాయన్నారు. అప్పటినుండి ఇప్పటివరకు ఎలక్షన్ లేక అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం, పాల్వంచ, ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన విధంగా మందమర్రిని కూడా మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఊరు మందమర్రి, రామకృష్ణాపూర్, నార్లాపూర్ లను కలిపి గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేయాలని వారు సూచించారు. ఈవిషయమై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని బిజెపి నాయకులు అందుగుల శ్రీనివాస్ అన్నారు . బి ఆర్ ఎస్ నాయకులు ఓ. రాజశేఖర్ మాట్లాడుతూ అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరహాలో ఉద్యమించాలన్నారు. మందమర్రి అభివృద్ధికి ఎన్నికలు ఒకటే మార్గమని సిపిఐ నాయకులు రాయబారపు వెంకన్న సూచించారు. బీఎస్పీ నాయకులు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలు జరిపించే అంతవరకు ఈ పోరాటం ఆగదన్నారు. అఖిలపక్ష పోరాటానికి మా మద్దతు ఎప్పుడు ఉంటుందని జనసేన నాయకులు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అఖిలపక్షం నాయకులు కొంగల తిరుపతిరెడ్డి, బండారి సూరిబాబు, పల్లె నర్సింహులు, సప్పిడి నరేష్, ఎం.డి అబ్బాస్, బర్ల సదానందం, మద్ది శంకర్, భూపెల్లి కనకయ్య, బట్టు రాజ్ కుమార్, జనార్ధన్, రాజేంద్రప్రసాద్, బాలాజీ, రంగు శీను, చిత్రాల చారి, తదితరులు పాల్గొన్నారు.