ఎస్సి వర్గీకరణపై బిజెపి అలసత్వాన్ని విడాలి
రైతు జనసమితి రాష్ట్ర అధ్యక్షులు మోహన్ రెడ్డి
జగిత్యాల, సెప్టెంబర్ 15: పండిట్ దీన్ దయాల్ స్ఫూర్తితోనే బిజెపి నడుస్తోందని చెప్పే బిజెపి పార్టీ ఆయన స్ఫూర్తికి విరుద్ధంగా వర్గీకరణపై అలసత్వాన్ని ప్రదర్శించడమెందుకని తెలంగాణ రైతు జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కంటి మోహన్ రెడ్డి అన్నారు.
ఎస్సి వర్గీకరణ సాధనే లక్ష్యంగా జగిత్యాల లో ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షలు ఐదవ రోజుకు చేరాయి. శుక్రవారం తెలంగాణ రైతు జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కంటి మోహన్ రెడ్డి మద్దతు పలికారు. ఈ సందర్భంగా మోహన్ రెడ్డి మాట్లాడుతూ 77 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఎస్సి ఉమ్మడి రిజర్వేషన్ విధానంతో దశాబ్దాల తరబడి ఏకపక్ష దోపిడీకి గురవుతున్నారన్నారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల కోటాలో ఎవరి వాటా వారికి న్యాయబద్ధంగా అందాలంటే ఎస్సి వర్గీకరణ జరగాలని అన్నారు. బిజెపి పార్టీ కాలయాపన చేయకుండా సత్వరమే నిర్ణయం తీసుకోవాలని అన్నారు. బిజెపి పార్టీ పండిట్ దిన్ దయాల్ అంత్యోదయ స్ఫూర్తికి అనుగుణంగా వర్గీకరణ పై నాంచివేత ధోరణి ఎందుకని ప్రశ్నించారు. వర్గీకరణను విస్మరించడం అంటే తమపార్టీ అంత్యోదయ సిద్ధాంతానికి, సామాజిక న్యాయానికి సమాధి చేయడమేనని మండి పడ్డారు. ఎవరు ప్రస్తావించని అనేక సమస్యలపై బిల్లులను పార్లమెంటులో ఆమోదింపచేసుకొన్నారని ఒక్క పైసా ఖర్చుకాని న్యాయమైన సమస్యపై ఎందుకు తాత్సారం అని మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సి వర్గీకరణకు చట్టబద్దత కల్పించి 29 ఏండ్ల మాదిగల సుదీర్ఘమైన పోరాటానికి న్యాయమైన ముగింపు ఇవ్వాలని మోహన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమం ఎంఎస్పీ జిల్లా కో కన్వీనర్ దూమాల గంగారాం ఆధ్వర్యంలో నడువగా ఇందులో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి, ఎంఎస్పి కో కన్వీనర్ సతీష్ మాదిగ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దర్శనాల శంకర్, జిల్లా కో ఇంఛార్జి ముల్కల శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ సురుగు శ్రీనివాస్, జగిత్యాల నియోజికవర్గా ఇంఛార్జి బొనాగిరి కిషన్, కో ఇంఛార్జి మిసాల సాయిలు, ధర్మపురి నియోజకవర్గ ధికొండ మహేందర్, పట్టణ ఇంఛార్జి బోల్లారపు దివాకర్, ఎంఎస్పి మల్యాల మండల ఇంఛార్జి ముప్పరాపు రామ స్వామి, అర్బన్ మండల ఇంఛార్జి బిరుదులు శ్రీనివాస్, ఎనుగంటి హరీష్, చిర్ర లక్ష్మణ్, మెడపట్ల రాజన్న, కట్కురి రాజనర్సయ్య, తెలంగాణ జన సమితి నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి శంకరయ్య, జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు కంటి రమేష్, వన్నెల శశి, రంపల్లి శాం, దేశాల గంగారెడ్డి, మైలారపు శయం, తిరుపతి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.