హైదరాబాద్ మార్చ్ 20 ;: ఎస్.ఆర్ నగర్ గురుస్తాన్ పిరమిడ్ సెంటర్లో ఫిల్మ్ ఇండస్ట్రీ రామ్,లక్ష్మణ్ ఫైటర్స్ గార్లతో ఎఫ్ ఎఫ్ కేఎం జి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ కోవూరి సత్యనారాయణగౌడ్ మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంలో మాట్లాడుతూ ఫైటర్స్ రామ్, లక్ష్మణ్ ద్వారా గ్రహించదగిన, తెలుసుకోదగిన విషయాలు అవి ఏమనగా ఈ సృష్టిలో ప్రతి ప్రాణి తన గురించి తాను తెలుసుకున్నప్పుడే ఉత్తముడవుతాడని, నలుగురికి ఉపయోగపడేలా ఆదర్శవంతంగా ఉండేలా ఉంటాడని తెలియజేస్తూ మన జీవితంలో ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉందనేే భావనలో ఉంటూ ప్రకృతికి దగ్గరగా బ్రతకాలని అప్పుడే ఆ ప్రకృతి మనకు ఏది కావాలో అది సమకూరుస్తుందని చాలా స్పష్టంగా తెలియజేశారని చెప్పారు. అదేవిధంగా ఈరోజు ఫిల్మి ఇండస్ట్రీ ఫైటర్స్ రామ్,లక్ష్మణ్ గార్లను కలవడానికి గల కారణం ఆ ప్రకృతియే అని కొనియాడుతూ మనం ఏ విధంగా ఆలోచిస్తామో అలాంటివారినే మన జీవితంలో ప్రకృతి దగ్గరకు చేస్తుందని సంతోషిస్తూ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ యొక్క గురుస్తాన్ పిరమిడ్ ధ్యాన కేంద్ర సత్సంగ్ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పిరమిడ్ ధ్యానులు పాల్గొన్నారు.