నారాయణఖేడ్ ప్రజాబలం ప్రతినిధి నారాయణఖేడ్ ప్రతి వాహనదారుడు రోడ్లపై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్సై ఆర్ శ్రీశైలం అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు తమ పనుల నిమిత్తం కార్లు బైకులపై రోడ్లపై వెళ్లేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని ద్విచక్ర వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సెల్ఫోన్ మాట్లాడుతూ బైక్ నడపకూడదని కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలని వాహనాల ధ్రువపత్రాలు ఇన్సూరెన్స్ పొల్యూషన్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఆర్ సి బుక్ కలిగి ఉండాలని మద్యం సేవించి వాహనం నడుపుతూ పోలీస్ వారి తనిఖీల్లో పట్టుబడితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి జరిమానా తో పాటు జైలు శిక్ష కూడా తప్పదని తెలిపారు