జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజా బలం దినపత్రిక మెదక్ జిల్లా ప్రతినిధి
30.09.2024:
ప్రజావాణిలో ప్రజల నుండి 87 దరఖాస్తు స్వీకరణ
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కార స్వభావంపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యలతో వచ్చిన ప్రజల పట్ల జవాబుదారీగా ఉండాలని అన్నారు. ప్రజావాణి, ప్రతి సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. మండల పర్యటనలో గుర్తించిన సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజావాణి దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మన పరిధిలో పరిష్కరించడానికి అవకాశం ఉన్న దరఖాస్తులు పరిష్కరానికి.కాలయాపన చేయొద్దని పేర్కొన్నారు.
జిల్లా నలుమూల నుండి భూ సమస్యలు 25, పెన్షన్స్ -04, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 19, ఇతర సమస్యలు-39, దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డి ఆర్ డి ఏ పి డి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, సంబంధిత ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.