విఘ్నాలు తొలగించే సిద్ధి వినాయకుడి ఆశీస్సులు అందరికి ఉండాలి.

 

మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు
తాజామాజీ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ దంపతులు.

టాటా కాపీ వెంచర్ లో ప్రత్యక్ష పూజలు.

మెదక్ తూప్రాన్ ప్రాజబలం న్యూస్ :-

గణనాథుడు ప్రజల సర్వ విఘ్నాలను తొలగించి సర్వ
శుభాలను ప్రసాదించాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు బుడ్డ స్వర్ణలతభాగ్యరాజ్ దంపతులు అన్నారు, వినాయక చవితి వేడుకలను పురస్కరించుకొని సోమవారం రాత్రి టాటా కాపీ వెంచర్ లో తూప్రాన్ మున్సిపల్ పరిధిలో వినాయకుడిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. తూప్రాన్ మున్సిపల్ మండల ప్రజలు మరియు చందాయిపేట గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే గణపతి, విజ్ఞాధిపతి అయిన ఆ లంబోదరుడి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రకృతి వైపరీత్యాలు తొలిగి ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ నిర్వాహకులు,బుడ్డ భాగ్యరాజ్, దశరథ్,గడ్డమీది రాజుయాదవ్,మహేందర్,మల్లేష్ యాదవ్,శంకర్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking