జై బాపు,జై భీమ్‌,జై సంవిదాన్‌ పాదయాత్రను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రెటరీ కైలాష్‌ బి కుమార్‌
గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి: కాంగ్రేస్‌ ప్రభుత్వం తలపెట్టిన జై బాపు,జై భీమ్‌,జై సంవిదాన్‌ పాదయాత్రను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ఏకతాటిపై వచ్చి ముందుకు నడవవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ,గోశామహల్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ కైలాష్‌ బి కుమార్‌ పేర్కొన్నారు.ఈమేరకు. గురువారం జాంబాగ్‌ డివిజన్‌, పటేల్‌ నగర్‌,కమిటీ హాల్‌ లో కాంగ్రెస్‌ పార్టీ జాంభాగ్‌ డివిజన్‌ ఇంచార్జి సికే.మూర్తి అధ్యక్షతన,డివిజన్‌ కమిటీ నాయకుల సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి జనరల్‌ సెక్రెటరీ కైలాష్‌ బి కుమార్‌ మాట్లాడుతూ..కాంగ్రేస్‌ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అరువులైన వారికి అందుతున్నాయా లేదా అని గడపగడపకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. అదేవిధం త్వరలో ప్రారంభం కానున్న జై బాపూ,జై భీమ్‌,జై సంవిధాన్‌ పాదయాత్రను విజయవంతం చేసేందుకు గోశామహల్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు సంజయ్‌ కుమార్‌ యాదవ్‌,శ్రీకాంత్‌ యాదవ్‌,బి.వెంకటేష్‌,ఎండి.ఖధీర్‌, దాసరి రాజ్‌ కుమార్‌,సయ్యద్‌ యూసుఫ్‌, మొహమ్మద్‌ ఇఫ్తేకార్‌ ఆలీ, సుభాష్‌ లడ్డు,జుబేద్‌ ఖాన్‌,చైతన్య,నర్సింహ,సదానందం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking