టేక్మాల్ మండలంలో జోరుగా అభివృద్ధి పనులు

 

👉వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు,ప్రత్యేక కృతజ్ఞతలు

👉టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్

అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చ్ 5 ( ప్రజాబలం) సంగారెడ్డి జిల్లా: టేక్మాల్ మండలంలో రెండో విడతగా ఒక కోటి 20.లక్షల రూపాయలు,( ఎన్ఆర్ఈజీఎస్) నిధులు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు, టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నిమ్మ రమేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు, అందులో భాగంగా 13. గ్రామాలకు 5.లక్షల చొప్పున సిసి రోడ్డు పనులు, బొడ్మట్ పల్లి హైస్కూల్ ప్రహరీ గోడకు 25. లక్షలు, దన్నూర జిల్లా పరిషత్ హైస్కూల్ కు 15. లక్షలు టేక్మాల్ మోడల్ స్కూల్ పిడబ్ల్యు రోడ్డు నుంచి మోడల్ స్కూల్ వరకు 15 లక్షల సిసి రోడ్డు,టేక్మాల్ ఎస్సీ హాస్టల్ ప్రహరీ గోడకు 5 లక్షలు, టేక్మాల్ మోడల్ స్కూల్కు సంబంధించిన 15, లక్షల సిసి రోడ్డు పనులనుప్రారంభిస్తూ, మోడల్ స్కూల్ కు సంబంధించిన, అభివృద్ధి పనులను పర్యవేక్షించి, ఇంకా జరగబోయే పనుల గురించి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సాయిలు తో మండల కాంగ్రెస్ కమిటీ నాయకులు చర్చించడం జరిగింది, ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే అట్టి విషయాల్లో మంత్రి దృష్టికి తీసుకు పోదామని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భక్తుల కిషోర్, మాజీ కో ఆప్షన్ షేక్ మజాహర్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ ఆశిలి సాగర్,మాజీ సర్పంచ్ ఆకులపల్లి పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking