కమిషనరేట్ లో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

 

అహింసే ఆయుధం అందరికి ఆదర్శం మహాత్ముని జీవితం

పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02 : జాతిపిత మహాత్మా గాంధీ జయంతి జయంతి వేడుకలను బుధవారం రోజున రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ ఐపిఎస్ ఐజీ ఎం శ్రీనివాస్ గాంధీ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా సిపి మాట్లాడుతూ…జాతిపిత మహాత్మా గాంధీ చూపిన సత్యం,ధర్మం,సహనం, అహింసా మార్గాలు ప్రతిఒక్కరూ అనుసరించాలని,గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించామని,ప్రతి ఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు.దేశ పౌరులు,గాంధేయ మార్గంలో నడుచుకోవాలని,గాంధీ చూపిన బాటలో విధులు నిర్వర్తించి ప్రజలకు పోలీసు సేవలను అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, ఏఆర్ ఏసీపీ ప్రతాప్,ఆర్ఐ దామోదర్,మల్లేశం, ఆర్ఎస్ఐ లు అనిల్, శ్రావణి,పోచలింగం,వివిధ వింగ్స్ సిబ్బంది, ఏఆర్,స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking