రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 12 ఆగస్టు 2024:
ఒకప్పటి పుప్పాలగూడ గ్రామ పంచాయతీ ఇంతింతై వటుడింతై అన్న చందంగా శీఘ్ర గతిగా అభివృద్ధి చెంది ప్రస్తుతం మణికొండ కాన్సిల్ గా రూపాంతరం చెంది వార్డ్ 11 లో గల నానక్క్రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, క్రీన్స్ టెర్మినస్ రోడ్డులో చిన్నపాటి వర్షానికి రోడ్డుపై వాగులు వంకలుగా పారుతున్న వర్షపు నీటి నుండి దాటాలంటే నరకయాతన అనుభవించ వలసిన అవసరం ఉందని మోటార్ సైకిల్ మరియు కార్లు ఎక్కడివక్కడే ఆపు కోవలసి వస్తున్నదని ప్రజాభిప్రాయమ్ తెలుపు చున్నారు, ఇట్టి రోడ్డు వర్షపు నీరు సరి అయిన పద్ధతిలో పోయే విధంగా మరమ్మత్తులు చేసి ప్రజలకు మేలు చేయాలని మణికొండ కౌన్సిల్ ప్రజా ప్రతినిధులకు అధికారులకు ది సిటిజన్స్ కౌన్సిల్ సభ్యుల విన్నపం.
Next Post