ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫిబ్రవరి 25:
2025 ఆర్థిక అక్షరాస్యత వారోత్సవంలో భాగంగా ప్రజలలో, ముఖ్యంగా మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహాన పెంచెందుకు ఆర్బిఐ సూచనల మేరకు మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ 2కె వాక్ ను నిర్వహించారు. 2కె వాక్ ను జిల్లా అదనపు కలెక్టరు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి థీమ్ “మహిళా శ్రేయస్సు” అని ఆర్థిక ప్రణాళిక, సూక్ష్మ పొదుపులు మరియు నష్ట తగ్గింపుపై దృష్టి సారించాలనేది ముఖ్యఉద్దేశ్యం.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ హరిప్రియ, జిల్లా లా ఆఫీసర్ చంద్రావతి, జిల్లా సంక్షేమాధికారి, బిసి వెల్ఫేర్అధికారి, ఎస్సీ వెల్పేర్అధికారి, డిఆర్డిఓ, ఎల్డిఎం, కలెక్టరేట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking