ఖమ్మం ప్రతినిధి జనవరి 01 (ప్రజాబలం) ఖమ్మం సిటీలోని స్వీట్ షాప్స్,రెస్టారెంట్స్ నిర్వాహకులు
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా ఆదివారం, సోమవారం రోజుల్లో పోటీ పడి తక్కువ రేట్లకు అమ్మకాలు జరుపుతున్నారు జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ ఆదేశాల మేరకు పలు షాపుల్లో జిల్లా ఆహార తనిఖీ శాఖ అధికారి రాయపూడి కిరణ్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. షాపుల్లోని కేక్,బిర్యానీ పోట్లలలోని శాంపిళ్లను తీసి పరిశీలించారు నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.కేక్,బిర్యానీ తయారీలలో క్వాలిటీ తగ్గించి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు గా అమ్మకాలు జరపొద్దని చెప్పారు.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తయారీలో నాణ్యత పాటించాలని తెలిపారు.ఆహార కల్తీ జరిగినట్లు ప్రజల నుంచి కంప్లైంట్ వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Post