భక్తుల సౌకర్యార్థము టి.టి.డి తరహాలో “జల ప్రసాదము ప్లాంట్

ప్రజాబలం ప్రతినిధి : కర్మన్ ఘాట్ హనుమాన్ దేవస్థానములో భక్తుల సౌకర్యార్థము టి.టి.డి తరహాలో “జల ప్రసాదము ప్లాంట్” తమ స్వంత నిధులతో ఏర్పాటు చేయుటకు “రాజు వేగ్నేష ఫౌండేషన్ వారు అంగీకరించి సంస్థ చైర్మన్ కోటి రాజు సతీమణి బాల సరస్వతి దేవస్థానమునకు విచ్చేసి స్వామి వారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరము ప్లాటు ఏర్పాటు చేయుటని ప్రతిపాదించిన స్థలములో పూజ నిర్వహించారు.

స్వామి వారికి ఇ-హుండీ ద్వారా విరాళములు అందించుటకు గాను దేవస్థానము పేరున యు.పి.ఐ. స్కానర్ ఏర్పాటు చేసి ఈ రోజు ఆలయ కార్యనిర్వహణాధికారి, చైర్మన్ మరియు ధర్మలకర్తల ద్వారా ఆవిష్కరించడం జరిగంది. భక్తులు యు.పి.ఐ ద్వారా నేరుగా తమ విరాళముల చెల్లింపులు చేయవచ్చును నాని తెలిపారు.
ఆలయములో అర్చకునిగా విధులు నిర్వర్తించుచున్న
చంద్రమా ప్రశాద్ వయసు రీత్యా ఈ రోజు ఉద్యోగ విరమణ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆలయ కార్యనిర్వహణాధికారి, చైర్మన్, ధర్మకర్తల్ మండలి సభ్యులు, అర్చకులు, సిబ్బంది, దేవాలమునకు విచ్చేసిన భక్తులు, దాతలు, మాజీ ధర్మకర్తలు శ్రీ చంద్రమా ప్రసాద్ అర్చకుల వారిని ఘనంగా సన్మానించి వారి శేష జీవితం సుఖప్రదంగా సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రములో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస శర్మ, చైర్మన్ పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, మొరిశెట్టి శ్రీనివాస్, చేగోని మల్లేష్ గౌడ్, చాతిరి అఖిల సాగర్, నర్రె శ్రీనివాస్, చలమల యాది రెడ్డి, దేవరపల్లి వెంకట్ రెడ్డి, సి.హెచ్. అనిత, పద్మాల శంకర్, ఆలయ అర్చకులు, సిబ్బంది మరియు భక్తులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking