ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ఆదివాసీ, గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.

 

విధ్వంసపు దారుల నుంచి
వికసిత తోవలు.

మోడువారిన బతుకుల్లో
మోదుగు పూల పరిమళాలు.

గిరిజనులు, ఆదివాసీల దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే. ప్రధానంగా ఆదివాసీల మూడు డిమాండ్లయిన స్వయంపాలన, రిజర్వేషన్ల పెంపు, పోడు భూముల పట్టాలను నిజం చేసింది కేసీఆర్ గారు.

మావ నాటే మావ రాజ్.
మా తాండాలో మా రాజ్యం అనే ఆదివాసీల ప్రజాస్వామిక ఆకాంక్షను సాకారం చేస్తూ 2,471 గూడేలను, తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి ఆదివాసీ గిరిజనుల ఆకాంక్షలను నెరవేర్చింది కేసీఆర్ గారు.

విద్య, ఉద్యోగ రంగాల్లో ఆదివాసీ గిరిజనుల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు వారికి 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచింది.

జల్..జంగల్.. జమీన్ అన్న కొమురం భీమ్ నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ గారు.

నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా ఆదివాసీ, గిరిజనులకు శుభాకాంక్షలు.

Leave A Reply

Your email address will not be published.

Breaking