కేయూ నూతన రిజిస్ట్రార్ కు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య

 

ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా ఫిబ్రవరి1:కాకతీయ విశ్వవిద్యాల యం నూతన రిజిస్ట్రార్ గా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ వి. రామచంద్రం కు ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలోని బచ్చన్నపేట మండలం సాల్వాపూర్ అనే మారుమూల ప్రాంతంలో పేద దళిత కుటుంబంలో జన్మించి,చిన్నతనం నుండే ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని ఉన్నత విద్యను అభ్యసించి ఈరోజు కాకతీయ విశ్వవిద్యాలయం కు రిజిస్ట్రార్ కావడం అభినందనీయమని గుమ్మడి నర్సయ్య అన్నారు. విశ్వవిద్యాలయ అభివృద్ధికి, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏ.ఐ.యు.కె.ఎస్) రాష్ట్ర సహాయ కార్యదర్శి చంద్రన్న, రాష్ట్ర నాయకులు జగ్గన్న,కేయూ పరిశోధక విద్యార్థి,పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు,వరంగల్ జిల్లా అధ్యక్షులు అలువాల నరేష్,రాష్ట్ర నాయకులు కావ్య,బాలు,అనూష, పృధ్విరాజ్,వంశీ,సంగీత పవన్ కళ్యాణ్,సంగీత,గణేష్,శ్రీజ,జ్యోతి, సాధన,మానస,సాత్విక,చందన తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking