లక్ష ఓట్ల మెజారిటీతో గడ్డం వంశీ కృష్ణ ను గెలిపించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మే 08 : పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమం భాగంగా మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని మోదేల,ఉత్కూర్,ఇటిక్యాల లో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు.ఎమ్మెల్యే మాట్లాడుతూ…రానున్న పార్లమెంటు ఎన్నికలలో ప్రజల బాగు కోరే ప్రభుత్వం కేంద్రం లో రావాలంటే చేతి గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశి కృష్ణను లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపించాలని ప్రజలను కోరారు,యువకుడు విద్యావంతుడు అయిన వంశి ని గెలిపిస్తే రానున్న రోజుల్లో యువతకు మంచి ఉపాది అవకాశాలు కల్గిస్తాడని పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాడని అన్నారు.
ఈ కార్యక్రమంలో లో పట్టణ అధ్యక్షుడు ఏండి అరిఫ్, జిల్లా ఉపాధ్యక్షుడు చింత అశోక్ కుమార్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్లా నాగభూషణం,మాజీ సర్పంచ్ రాయలింగ్,డీసీసీ అధికార ప్రతినిధి బియ్యల తిరుపతి,కౌన్సిలర్ సురేష్ నాయక్,గడికొప్పుల ఉమా దేవి, రందేని వెంకటేష్,చింత సువర్ణ,యూత్ అధ్యక్షుడు రందేని చిన్న వెంకటేష్,కొత్త వెంకటేశ్వర్లు,హాజీ, వెంకటస్వామి గౌడ్,తోట రవి,అమీర్,శ్రీధర్,నవాబ్, చిన్న రమేష్,బాణాల రమేష్, రాజు,దేవా,గడికొప్పుల కిరణ్, మడిపెళ్లి స్వామి,మనోహర్, నర్సింమాచారి, వివిధ వర్డ్ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking