గణనాథుని లడ్డూ వేలం పాట, పోటా పోటీగా జరిగి చివరికి ప్రణీత్ కాన్సెప్ట్ బిల్డర్ అధినేత యస్.సురేష్ 10,00,000/- పది లక్షలకు దక్కించుకున్నారు
రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 29 సెప్టెంబర్ 2023: మణికొండ మునిసిపాలిటీ పరిధి లోని అల్కాపుర్ టౌన్షిప్ గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా నవరాత్రులు పూజలందుకున్న గణనాథుని లడ్డూ వేలం పాట, పోటా పోటీగా జరిగి చివరికి ప్రణీత్ కాన్సెప్ట్ బిల్డర్ అధినేత యస్.సురేష్ 10,00,000/- పది లక్షలకు దక్కించుకున్నారు. వేలంపాట కమిటీ అధ్యక్షుడు వి.బాల్ రెడ్డి, 9 వ వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్ స్వామి సభ్యులు నిలేశ్ ప్రసాద్ దుబె, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రీధర్ పసుపులేటి, కే.శ్రీనివాస్ రెడ్డి, కిరణ్, దిలీప్, శ్యామ్, ధీరజ్ రెడ్డి, నరేష్ కుమార్, శ్రవణ్ కుమార్, డి.శ్రీనివాస్ రెడ్డి, ధనరాజ్ సింగ్, చిరంజీత్ తది తరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.