పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్
ద్వారా వివరాలను నమోదు చేసుకుని పోలీసు వారికి సహకరించాలి.
జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.
ప్రజాబలం – మెదక్ జిల్లా ప్రతినిధి 2 సెప్టెంబర్2024:
సోమవారం రోజునా మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. శ్రీ.డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. గారు మాట్లాడుతూ… పోలీసు శాఖ వారు రూపొందించిన గణేష్ మండపం నిర్వహణకు సంబంధించిన ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం మండపం నిర్వహణ మరియు మండపంనకు సంబంధించిన సమాచారం కొరకు మాత్రమే రూపొందించిందని అని, ఈ యొక్క సమాచారం ద్వారా భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందని , ఆన్ లైన్ ఇన్ఫర్మేషన్ కు ఎటువంటి రుసుము లేదని ఎస్పీ గారు తెలిపారు. గణేష్ ఉత్సవాల నిర్వాహకులు గణేష్ విగ్రహాలను వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేయుటకు ముందు, ముందస్తు సమాచారం పోలీసుస్టేషన్ లో సమాచారం ఇవ్వాలని అందుకోసం ఏదైనా కంప్యూటర్, మొబైల్ నందు అప్లై చేసుకోవాలి అని అన్నారు. అందుకొరకు గణేష్ మండపాల ఏర్పాటు కొరకు పోలీస్ శాఖ అనుమతి నిమిత్తం క్రింది లింకు ద్వారా సంప్రదించగలరు. https://policeportal.tspolice.gov.in/index.htm ఆన్లైన్లో ఫారమ్‌ను పూరించిన తర్వాత దరఖాస్తుదారుడు అప్లికేషన్ ఫారమ్‌తో పాటు కంప్యూటర్‌లో రూపొందించిన అక్నాలెడ్జ్‌మెంట్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలి. గణేష్ మండపాలను ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
వినాయక మండపాల ఏర్పాటుకు పోలీస్ వారి సూచనలు
మండపం ఏర్పాటు చేసే స్థలం కోసం సంబంధిత శాఖల వారితో అనుమతులు తీసుకోవాలి.
గణేష్ మండపాల కొరకు విద్యుత్ శాఖ వారి అనుమతితోనే కనెక్షన్ తీసుకోవాలి.
షార్ట్ సర్క్యూట్ జరుగకుండా మంచి నాణ్యత గల వైరును ఉపయోగించాలి.
గణేష్ మండపాల నిర్వాహకులు వారి మండపాల కమిటీ వివరాలు, మండపాల బాధ్యత వహించే వారి వివరాలు, ఫోన్ నెంబర్ల ను మండపంలో ఏర్పాటు చేయాలి. వృద్ధులు, చదువుకునే విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా ఉండే తక్కువ శబ్దకాలుష్యంతో స్పీకర్లను ఏర్పాటు చేసుకోవాలి.
సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లను వినియోగించాలి. మండపాల్లో ఎట్టిపరిస్థితులోను డిజేను ఏర్పాటు చేయరాదు. గణేష్ ప్రతిమలు కూర్చుండబెట్టే ప్రదేశంలో షెడ్ నిర్మాణంలో మంచి నాణ్యత గల షెడ్ ఏర్పాటు చేయవలెను. గణేష్ మండపంలో 24 గంటలు ఒక వాలంటీర్ ఉండే విధంగా నిర్వహకులు తగు చర్యలు తీసుకోవాలి. గణేష్ మండపాలకు వచ్చే భక్తుల సందర్శను దృష్టిలో వుంచుకోని మండపాలలో భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు వాలంటీర్లను నియమించాలి.
గణేష్ మండపాల వద్ద ఎప్పుడైన అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ముందు జాగ్రత్తలో భాగంగా తగు ఏర్పాట్లు చేసుకోవాలి.
గణేష్ మండపాల వద్ద మద్యం సేవించడం, పేకాట అడటం, అసభ్యకరమైన నృత్యాల ఏర్పాటు, అన్యమతస్తులను కించపరిచే విధంగా ప్రసంగాలు చేయడం, పాటలు పాడటంపై పూర్తిగా నిషేధం.
విధిగా పాయింట్ పుస్తకం ఏర్పాటు చేసుకోవాలి, పోలీసుఅధికారులతనిఖీకి వచ్చినప్పుడు అందులో వ్రాసి సంతకం చేస్తారు.
మండపాల్లో ఏదైనా అనుమానాస్పదంగా బ్యాగులు, ప్లాస్టిక్ సంచులు, వస్తువులు లేదా వ్యక్తులు కనిపించినట్లుయితే తక్షణమే డయల్ 100గాని లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి.
సామాజికమాధ్యమాలలో వచ్చే ఎలాంటి రూమర్స్, వదంతులను నమ్మకూడదు ఎవ్వరికైన ఎలాంటి సందేహాలు ఉన్న సంబంధిత పోలీసు వారికి లేదా DAIL 100 కి కానీ జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ *87126 57888 సమాచారం అందించాలని సూచించారు. ఈ పండుగను అందరము శాంతి యుతంగా నిర్వహించుకోవాలని కోరారు.