ఢీల్లీకీ బయలు దేరిన గోషామహల్‌ కాంగ్రెస్‌ నాయకులు

 

 

     
గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:జాతీయ కాంగ్రెస్‌ నాయకులు పార్లమెంట్‌ లో ప్రతిపక్ష నాయకులు రాహుల్‌ గాంధీ ఆదేశంతో తెలంగాణాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటింటికి నిష్పక్షపాతంగా సర్వే చేయించి. సర్వే ఆధారంగా అసెంబ్లీ లో తీర్మానం చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని పార్లమెంట్‌కు పంపిచడం జరిగినది.కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు పెట్టకుండా కుంటి సాకులు చెేపుతూ జాప్యం చేస్తున్నది.ఇందుకుగాను తెలంగాణ రాష్ట్రం ఇన్‌చార్జ్‌ శ్రీమతి మీనాక్షి నటరాజన్‌ టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కూమార్‌ గౌడ్‌ నేతృత్వంలో ఈ నెల 5.6,7 తేదీలలో ఛలో ఢీల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

 

             
బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని 5.6,7 తేదీలలో ఛలో ఢీల్లీ కార్యక్రమానికి గోషామహల్‌ అసెంబ్లీ నియోజకవర్గంనుంచి చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుండి సోమవారం తెలంగాణ రాష్ట్రం ఇన్‌చార్జ్‌ శ్రీమతి మీనాక్షి నటరాజన్‌ టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కూమార్‌ గౌడ్‌ లతో గోషామహల్‌ నియోజక వర్గం కాంగ్రెస్‌ నాయకులు రాంశెట్టి నరేందర్‌,నాగేష్‌,దాసరి రాజ్‌కూమార్‌ ,ఎస్‌.కె.అశోక్‌ ,రాంబాబు గౌడ్‌ ,రాధక్రిష్ణ , వెంకటేష్‌ ,సంతోష్‌గుప్తా ,ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఇన్‌చార్జ్‌ శ్రీమతి మీనాక్షి నటరాజన్‌ ను మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది.

Leave A Reply

Your email address will not be published.

Breaking