మెదక్ తూప్రాన్ ప్రజా బలం న్యూస్ ,:-
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇవాళ పోలీసుల ఆద్వర్యంలో మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ కేంద్రంలో కేంద్రంలో ఏర్పాటు చేసిన
2 కే రన్ ను స్థానిక డిఎస్పీ యాదగిరి రెడ్డి, గడ ముత్యంరెడ్డి , ఆర్డీవో శ్యాంప్రకాష్ లు ప్రారంబించారు . తూప్రాన్ ఎస్ఐ ఏర్పాటు చేసిన ఈ2k రన్ లో యువత, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, బిఆరెఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.. డీజే పాటలతో రన్నర్లకు ఉత్తేజం ఉత్సాహం నింపాయి. ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సభను ఉద్దేశి స్థానిక డిఎస్పీ యాదగిరి రెడ్డి,సిఐ శ్రీధర్, మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్,గడ ముత్యం రెడ్డి మాట్లాడుతూ మన దైనంది నా జీవితంలో మనం ఆరోగ్యంగా ఆయుష్ గా ఉండాలంటే నడవడం రన్నింగ్ లో పాల్గొంటూ కొన్ని హెల్త్ కార్యక్రమాలపై శ్రద్ధ పెట్టి నట్లయితే టెన్షన్స్ లాంటివి తగ్గి ఆరోగ్యంగా ఉంటామని మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రణాళికలో పెట్టినారు అన్నారు గతంలో చూసుకుంటే సైకిల్ ఉండే ప్రస్తుతం ఇప్పుడు మోటార్రు బైకులు స్కూటర్లు కార్లు ఇలాంటివి అయి ఆరోగ్యంపై శ్రద్ధలు తగ్గి నాయి అని అన్నారు
కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ నాయకులు బోలంపల్లి బాబుల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, కమ్మరి శ్రీదర్, దాబా కాశిరెడ్డి, కుమ్మరి రమేష్, బురాన్ భాయ్, దామోదర్ రెడ్డి, మన్నె శ్రీనివాస్, శ్రీనివాస్, అంజి ఆర్డీవో శ్యాంప్రకాష్ , తూప్రాన్ సిఐ శ్రీధర్ స్థానిక ఎస్సై సురేష్ కుమార్, సందీప్ రెడ్డి, వివిధ పోలీస్ స్టేషన్లో నుండి నుండి వచ్చిన ఎస్ఐలు, సిబ్బంది, అధికారులు , మున్సిపాలిటీ కౌన్సిలర్ లు , కమీషనర్ మోహన్, విద్యార్థి , విద్యార్థులు, ప్రజాప్రతినిధులు యువకులు భారీగా పాల్గొన్నారు.