ముదిరాజ్‌ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్‌

సిరిసిల్ల ప్రజాబలం ప్రతినిధి:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్‌ లో జరిగిన రాజన్న సిరిసిల్ల జిల్లా ముదిరాజ్‌ సంఘ కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి కేకే మహేందర్‌ రెడ్డి తో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు..
ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ
ముదిరాజ్‌ కులస్తుల అందురు కలసి గట్టుగా మొన్నటి ఎన్నికల్లో ఎన్నుకున్న నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు..
జిల్లాలో ఉన్న ముదిరాజ్‌ కులస్తులకు నూతన కార్యవర్గం ఒక దిక్సూచిగా అండగా ఉండాలి..
ప్రభుత్వం అందజేసే సంక్షేమ పథకాలును అందరికి అందేలా చూడాలి..
రాబోవు రోజుల్లో ముదిరాజుల అభివృద్ధి కి పాటు పడాలి..
కులం ఒక బలం బలగం లాగా పని చేస్తుంది..
మనం కలసి గట్టుగా ఉండి ఇతర కులాలను కలుపు కొని రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలి..
గ్రామాల్లో ప్రశ్నించే వారికి గొప్ప గుర్తింపు ఉంటుంది..
మీకు నేను అండగా ఉంటా..
సాటి బీసీ బిడ్డలుగా బీసీ,ఎస్టీ ఎస్సీ, లకు అండగా ఉండాలి..


పని చేసిన వారికి ప్రజలు తప్పకుండా పట్టం కడతారు..వారికి గుర్తింపు తప్పకుండా వస్తుంది..
నాకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా ఈ రోజు మీ ముందు ఉన్నా…
ముదిరాజ్‌ ల చిరకాల కోరిక బీసీ డి నుండి బీసీ ఏ లోకి మార్చడానికి నా వంతు ప్రయత్నం చేస్తా..
మిడ్‌ మానేరు డ్యాం లో చేపల పెంపకానికి కేజీ కల్చర్‌ ద్వారా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది..
మత్స్యకారులు ఈ పథకాన్ని వియోగించుకోవాలి..
ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది..
రాహుల్‌ గాంధీ దేశంలోని అసమానతలు రూపుమాపడానికి కుల గణన జరగాలని పేరొన్నారు..
దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చొరవతో కుల గణన నిర్వచించడం జరిగింది..
బీసీ ల రిజర్వేషన్‌ పెంచడం జరుగుతుంది..
ప్రజా ప్రభుత్వంలో ఇంచుమించు 50 కోట్లతో 16 కలలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయడం జరిగింది..
రానున్న రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్టీ లము అందరూ కలసి గట్టుగా ఉండాలి..
మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం..
మహాత్మా జ్యోతి రావు పూలే పేరును ప్రజా ప్రభుత్వంలో ప్రగతి భవన్‌ కు ప్రజా భవన్‌ గా నామకరం చేశారు..
మహనీయుల అడుగు జాడల్లో నడుస్తూ ముందుకు పోదాం..
ముదిరాజ్‌ జిల్లా సంఘ భవనానికి నా వంతు కృషి చేస్తా..
ముదిరాజ్‌ లకు అండగా ఉంటా..

Leave A Reply

Your email address will not be published.

Breaking