-సిపిఐ ఎం.ఎల్ ప్రజాపంథా ఆధ్వర్యంలో కలెక్టర్ కి వినతి పత్రం.
ప్రజాబలం ప్రతినిధి హనుమకొండ జిల్లా ఏప్రిల్24:కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని సిపిఐ ఎం.ఎల్ ప్రజాపంథా జిల్లా నాయకులు చిర్ర సూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.గురువారం సిపిఐ ఎం.ఎల్ ప్రజాపంథా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి, డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్యకి ప్రతినిధి బృందంగా ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా చిర్ర సూరి మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, సొంత జాగా ఉన్నవారికి ఇంటి నిర్మాణమునకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10 లక్షల ఇవ్వాలని, సొంత ఇంటి స్థలం లేని వారికి ప్రభుత్వ భూమిని కేటాయించాలని,తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు 12 రకాల నిత్యవసర సరుకులు,10 కేజీల సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా ఉచితంగా అందించాలని, వృద్ధులకు,వితంతువులకు, వికలాంగులకు,ఒంటరి మహిళలకు కొత్తపెన్షన్స్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పథకాలు అందే విధంగా చొరవ చూపాలని కోరారు.లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్.ఎల్ ప్రజాపంథా వరంగల్ జిల్లా నాయకులు పసునూరిరాజు,పి.డి.ఎస్.యు.రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.నరసింహారావు, సిపిఐ ఎం.ఎల్ ప్రజాపంథా వరంగల్, నర్సంపేట డివిజన్ నాయకులు అడ్డూరి రాజు,మైదం పాణి,సాబిరికాని మోహన్,కత్తుల కొమురన్న,దార లింగన్న,అల్లం నారాయణ,జవహర్ లాల్,మనోహర చారి,రాజేందర్, ఎల్లయ్య,చిన్న స్వామి,వెంకటేష్, మల్లేష్,రాజు తదితరులు పాల్గొన్నారు.