మెదక్ తూప్రాన్ సెప్టెంబర్ 20 ప్రజాబలం న్యూస్ :-
మెదక్ జిల్లా తూప్రాన్ కేంద్రంలో ఈద్ మీలాద్ ఉన్ నబి పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. పెద్ద చెరువు కట్ట బాలేషహి దర్గా లో ప్రార్థన చేసి అక్కడనుండి రుద్రం మండల ఆర్ఎంపి పీఎంపీల అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అప్సర్ ఆధ్వర్యంలో
రహదారి మీదుగా ర్యాలీ తో ముస్లిం సోదరులు ,మొహమ్మద్ ప్రవక్త ను స్మరించుకుంటు గల్లీ గల్లీలో ఘనంగా మిలాద్ ర్యాలీ తీయడం జరిగింది. మొహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్బంగా అల్లహ్ ను ప్రార్థన చేస్తూ అందరు అహింస, శాంతి మార్గంలో అందరు నడవాలని అందరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని కోరుకుంటూ ఈద్ మీలాద్ ఉన్ నబి పండుగను జరుపుకోవడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో మైనార్టీ ప్రెసిడెంట్ షేక్ బురాన్, ఎండి అహ్మద్, మహమ్మద్ అప్సర్,
ఎండి సత్తార్, ఎండి ఉమర్, సమీర్, ఎండి అజార్,సత్తార్, యాసిన్ ఎండి సైజ్ బాయ్, ఎండి రిజ్వాన్, ఎండి సాన్, మోజు బాయ్, హైమద్, కాంగ్రెస్ నాయకులు ఉమర్ అనిల్ ముస్లిం సోదరులు, ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు,తదితరులు పాల్గొన్నారు.
