గోదావరి తీరంలో గంగ స్నానాలు.
భక్తులతో కిటకిటలాడిన గోదావరి ప్రాంతం.
లక్షెట్టిపేట: పట్టణంలోని గోదావరి తీరంలో మహాశివరాత్రి వేడుకలు, భక్తులతో రహదారులు రద్దీగా మారాయి.మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో ఫిబ్రవరి, లేదా మార్చి వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు. ఈ పండుగ రోజున గోదావరి పుణ్యస్నానాలు ఆచరించి కుటుంబం మొత్తం కలిసి పూజలు చేస్తారు.పుణ్య స్థానానికి వెళ్లిన భక్తులకు స్వచ్ఛంద సంస్థలు అల్పాహారం , నీరు అందిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన చిరు వ్యాపారుల దగ్గర బొమ్మలు,ఆటవస్తులు కొనుగోలు చేస్తారు.ఈ పండగ సంవత్సరంలో ఒక్క రోజే ఆచరిస్తారు.భక్తులతో, శివసత్తులతో గోదావరి ప్రాంతమంతా ఒక పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఈ శివరాత్రికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం ద్వారా భద్రత ఏర్పాట్లు చేస్తారు.ఈ రోజు శివ పూజ చేయడం ద్వారా కుటుంబానికి ఆయురారోగ్యాలు సుఖశాంతులతో శివపార్వతులు కుటుంబాన్ని కాపాడుతారని హిందువుల యొక్క నమ్మకం. పోలీస్ సిబ్బంది లక్షెట్టిపేట సీఐ ఏ నరేందర్,ఎస్సై పి చంద్రకుమార్, మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య మున్సిపల్ కమిషనర్ కల్లేడ రాజశేఖర్,మున్సిపల్ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
